Breaking News

జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్..


Published on: 08 Sep 2025 12:46  IST

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం (సెప్టెంబర్ 8) కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించగా, మరో జవానుకు గాయాలయ్యాయి.కుల్గాం జిల్లాలోని గుడ్డర్ అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ ఒక్కసారిగా ఎన్‌కౌంటర్‌గా మారిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి