Breaking News

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి


Published on: 09 Sep 2025 13:51  IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణంతో కేంద్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో తిరుపతిని నియమించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన తిరుపతి.. మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1983లో పార్టీలో చేరారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కార్యదర్శి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలీషియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి