Breaking News

ఖతార్‌పై దాడి గురించి నాకు ముందు చెప్పలేదు..


Published on: 16 Sep 2025 12:40  IST

హమాస్‌ నేతలే లక్ష్యంగా ఖతార్‌ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల గురించి అమెరికాతో ముందుగానే పంచుకున్నామని నాడు టెల్‌అవీవ్‌ పేర్కొనగా.. యూఎస్‌ కూడా దాన్ని అంగీకరించింది. ఈ విషయంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట మార్చేశారు. ఖతార్‌పై దాడుల గురించి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనకు ముందుగా చెప్పలేదన్నారు. సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి