Breaking News

మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత..


Published on: 16 Sep 2025 12:50  IST

మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్లిన ఆయన ఉన్నట్టుండి ఛాంబర్‌లో కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి శ్రీధర్ బాబు సిబ్బందిని అలర్ట్ చేశారు. హుటాహుటినా మధు యాష్కీనీ చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి