Breaking News

ఐదు నెలల్లో 30మంది మృతి..


Published on: 07 Oct 2025 15:31  IST

తురకపాలెంలో మృత్యుఘోష ఆగటంలేదు. మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినవారు శవాలుగా తిరిగి వస్తున్న పరిస్థితి. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నా మరణాలకు కారణం అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఐదు నెలల వ్యవధిలో 30మంది ప్రాణాలు కోల్పోవడంతో తురకపాలెం ప్రజల్లో మృత్యు భయం ఆవరించుకుంది. మరోవైపు, ఇప్పటివరకూ జరిగిన చావులకు అసలు కారణం ఏంటో వెల్లడించకపోవడంతో మరింత ఆందోళన నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి