Breaking News

100 శాతం వరకు పీఎఫ్‌ విత్‌డ్రా!..


Published on: 14 Oct 2025 11:20  IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు గొప్ప శుభవార్త చెప్పింది. ఉద్యోగి, యాజమాన్యం వాటా సహా పీఎఫ్‌ నిధిలో అర్హతగల బ్యాలెన్స్‌లో నూటికి నూరు శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్ల వరకు పాక్షిక విత్‌డ్రాయల్‌ పరిమితిని పెంచారు. పాక్షిక విత్‌డ్రాయల్స్‌ కోసం కనీస సర్వీసు నిబంధనను 12 నెలలకు తగ్గించారు. కార్మిక శాఖ ఓ ప్రకటనలో సోమవారం ఈ వివరాలను తెలిపింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సోమవారం ఈ సంచలన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి