Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ..


Published on: 17 Oct 2025 14:37  IST

తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. రీనోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని న్యాయవాది సురేందర్‌ పిటిషన్‌ వేశారు. విచారణలో హైకోర్టు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను “ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?” అని ప్రశ్నించింది. ప్రభుత్వం, ఈసీ సమాధానం ఇవ్వడానికి రెండు వారాల సమయం కోరగా, హైకోర్టు అంగీకరించి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు ఫలితంపై రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు దిశా నిర్దేశం కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి