Breaking News

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ..


Published on: 03 Nov 2025 11:06  IST

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి