Breaking News

షర్మిల.. కవిత.. రోహిణి


Published on: 17 Nov 2025 11:53  IST

మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్‌ సోదరి కవిత తరహాలోనే తాజాగా బిహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె, తేజస్వియాదవ్‌ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటికి వచ్చారు. తేజస్వియాదవ్‌, ఆయన సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి