Breaking News

సౌదీ ప్రమాదం...రెండు కుటుంబాల్లోని వారంతా


Published on: 17 Nov 2025 12:05  IST

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఎక్కువగా ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి