Breaking News

ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో పెట్టిన ఆకతాయి..


Published on: 17 Nov 2025 15:54  IST

ప్రకాశం జిల్లాలో షాక్‌తో పాటు మనల్ని షేక్ చేసే సంఘటన ఒకటి వెలుగు చూసింది.ఓ ఆకతాయి రెచ్చిపోయి ప్రవర్తించాడు. గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం 20 వేల రూపాయలకే ఎమ్మార్వో ఆఫీస్ అమ్ముతానంటూ పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి కూడా విషయం వెళ్లింది. ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి