Breaking News

మదీనా రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి..


Published on: 17 Nov 2025 17:05  IST

మక్కా యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు మదీనాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడటం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి ఆని పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి