Breaking News

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్..


Published on: 19 Nov 2025 14:18  IST

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసును జాతీయ దర్యాఫ్తు సంస్థ ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పేలుడుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. తాజాగా మరో కీలక అంశాన్ని కూడా బయటపెట్టింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి ఎర్రకోట పార్కింగ్‌ లాట్‌లో ఉంచిన కారులోనే బాంబును తయారు చేసినట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కారులో మూడు గంటల పాటు బాంబును రెడీ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి