Breaking News

లింక్‌ను ఓపెన్‌ చేసిన వ్యక్తికి ఊహించని షాక్


Published on: 20 Nov 2025 13:06  IST

బీబీపేటలో సైబర్ మోసం జరిగింది. వాట్సప్‌కు వచ్చిన లింకులను ఓ వ్యక్తి ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 6 లక్షల నగదను కోల్పోవాల్సి వచ్చింది. సదరు వ్యక్తి నుంచి భారీ నగదును సైబర్ మోసగాళ్లు లాక్కున్నారు. బాధితుడికి కొద్ది రోజుల క్రితం అమెజాన్ నుంచి వచ్చినట్టుగా ఓ లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపారు. లింక్‌ను ఓపెన్ చేసి టాస్క్‌లను పూర్తి చేస్తే రూ.5.49 లక్షలు లాభం వస్తాయని కేటుగాళ్లు నమ్మబలికారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ వ్యక్తి ఉన్న సొమ్ము పోతుందని ఊహించలేకపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి