Breaking News

కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి


Published on: 20 Nov 2025 14:32  IST

ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఓకే చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి