Breaking News

లిఫ్ట్‌లో ఇరుక్కొని బాలుడు మృతి


Published on: 20 Nov 2025 17:44  IST

ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని ఆ తల్లి ఐదో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్‌ ఎక్కింది… అక్కడికి చేరాక పెద్దకొడుకుతో కలిసి తను ముందుగా లిఫ్ట్‌ గేటు తెరిచి అందులోంచి బయటకు వచ్చింది… మరో బిడ్డ బయటకు వస్తున్న క్రమంలో లిఫ్ట్‌ కిందకు కదిలింది. చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది. ఆ తల్లి కేకలు వేసేసరికి అపార్ట్‌మెంట్‌ వాసులు లిఫ్ట్‌ ఆపేసి..లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడ్ని బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆ బాలుడిని దవాఖానకు తరలించగా..అప్పటికే ప్రాణాలొదిలాడు.

Follow us on , &

ఇవీ చదవండి