Breaking News

అక్టోబరులో పన్నుల రాబడి రూ.16,372 కోట్లు


Published on: 21 Nov 2025 12:36  IST

రాష్ట్ర ఖజానాకు అక్టోబరులో భారీగా పన్నుల ఆదాయం సమకూరింది. ఈ నెలలో అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్ల రాబడి వచ్చింది. ప్రధానంగా ఎక్సైజ్‌ పన్నులే ఖజానాకు ఊతమిచ్చాయి. సాధారణంగా ప్రతి నెలా పన్నుల కింద రూ.13,000-14,000 కోట్ల రాబడి సమకూరుతుంది. అక్టోబరులో మాత్రం రూ.16వేల కోట్ల మార్కు దాటడం గమనార్హం. అక్టోబరులో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ కింద వైన్‌ షాపులను కేటాయించడంతో భారీ మొత్తంలో రాబడి సమకూరింది.

Follow us on , &

ఇవీ చదవండి