Breaking News

ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి


Published on: 24 Nov 2025 17:32  IST

సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం జరిగింది. భవనం మరమ్మతులు చేస్తుండగా.. సెంట్రింగ్ కుప్పకూలింది. శ్లాబ్‌ పెచ్చులు మీద పడడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈఎస్ఐలోని అత్యవసర విభాగంలో ఆధునీకరణ (రెనోవేషన్) పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి