Breaking News

ధ్వజారోహణ ప్రత్యేకత..జెండాపై ఏముందంటే..?


Published on: 25 Nov 2025 15:10  IST

అయోధ్యలోని బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ మంగళవారం జెండాను ఎగురవేశారు. ఈ జెండాను పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభూజాకారంలో రూపొందించారు. ఈ జెండాపై రాముడి తేజస్సుతోపాటు ఆయన శౌర్యాన్ని సూచికగా సూర్యుడుతోపాటు కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్యారాచూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘ కాలం మన్నేలా ఈ వస్త్రాన్ని రూపొందించింది.

Follow us on , &

ఇవీ చదవండి