Breaking News

జనవరి, ఫిబ్రవరిలో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు


Published on: 25 Nov 2025 19:03  IST

రైల్వేశాఖ కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్లో వచ్చే ఏడాది (2026) జనవరి, ఫిబ్రవరి రెండు నెలలలో రైళ్ల రద్దు, దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెక్షన్‌లోని మందమర్రి రైల్వేస్టేషన్లో జరగనున్న మూడో లైన్ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 22 రోజులపాటు కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్ లో ప్రతిరోజు, రెండు మూడు రోజులకు ఒకసారి నడిచే (వారాంతరపు) పలు ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి