Breaking News

తుపాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం..


Published on: 26 Nov 2025 17:07  IST

మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. బుధవారం ఉదయం తుపాన్‌గా మారిన ఈ తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాన్‌కు సెన్యార్‌గా నామకరణం చేసినట్లు పేర్కొంది. ఈ తుఫానుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ‘సెన్యార్‌’ అని పేరు పెట్టినట్టు వెల్లడించింది.కాగా ఈ తుపాన్‌ 24 గంటల తర్వాత క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి