Breaking News

అంబర్‌పేటలో ఎస్సై గన్‌ మిస్సింగ్‌..


Published on: 26 Nov 2025 17:18  IST

అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు ఎస్సై భాను ప్రకాశ్‌ తుపాకీ మిస్సయినట్లుగా తాజాగా తోటి సిబ్బంది గుర్తించారు. అయితే రికవరీ చేసిన బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ పాన్‌ బ్రోకర్‌ షాపులో ఎస్సై అమ్మినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల తోనే తన గన్‌ను ఎస్సై తాకట్టు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎస్సై భానుప్రకాశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అలాగే గన్‌ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి