Breaking News

రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్..రేపు విచారణకు ఛాన్స్


Published on: 27 Nov 2025 11:46  IST

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్‌లు ఖరారు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు ఇచ్చారు కానీ, రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని తెలిపారు. జీవో నెంబర్ 46లో బీసీలోని ఏ బీ సీ డీ లకు రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదని పిటిషన్‌లో మచ్చదేవ్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి