Breaking News

విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు


Published on: 02 Dec 2025 10:25  IST

కువైట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు మంగళవారం తెల్లవారు జామున ఈ - మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన పైలెట్‌ను ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తం చేశారు. దాంతో శంషాబాద్ ఎయిర్‌పో‌ర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించారు. దేశవ్యాప్తంగా నకిలీ బెదిరింపులు అధికమయ్యాయి. ఈ కాల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి