Breaking News

సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి..


Published on: 02 Dec 2025 10:39  IST

దేశంలో ఇకపై విక్రయించే ప్రతి సెల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ ఉండాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్‌ను కొత్త ఫోన్‌లలో తప్పనిసరిగా డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్‌లల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించి కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోపు సమర్పించాలని తెలిపింది

Follow us on , &

ఇవీ చదవండి