Breaking News

తిరుచానూరులో దారుణం.. ఒకే ఇంట్లో..


Published on: 02 Dec 2025 10:51  IST

తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలకొట్టారు. ఆ ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న మూడు మృతదేహాల ను గుర్తించారు. అనంతరం ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీష్‌గా పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి