Breaking News

పార్లమెంటులో నాటకాలొద్దు


Published on: 02 Dec 2025 10:56  IST

నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలందించడానికని చెప్పారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షాలు చట్టసభలను ఎన్నికలకు సన్నద్ధమయ్యే వేదికగా మార్చుకుంటున్నాయని, ఓటముల తర్వాత ఎదురయ్యే అసహనాన్ని తగ్గించుకునే సాధనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి