Breaking News

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌


Published on: 02 Dec 2025 12:03  IST

సునీల్‌ కుమార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్‌ అధికారిగా ఉన్న సునీల్‌ కుమార్‌ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ అనకాపల్లి జిల్లాలోని ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్‌ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.సునీల్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి