Breaking News

నేటి నుంచి గిరిజన విద్యార్థుల సాంస్కృతిక సంబరం


Published on: 03 Dec 2025 15:27  IST

జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల వేడుక ఉద్భవ్‌-2025కు రాష్ట్ర రాజధాని అమరావతి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సాంస్కృతిక ఉత్సవాలకు తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో ఈనెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే 6వ జాతీయ స్థాయి ఈఎంఆర్‌ఎస్‌ సాంస్కృతిక ఉత్సవాల్లో గిరిజన విద్యార్థుల ఆటపాటలు,  వేదికపై కనువిందు చేయనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి