Breaking News

మ‌రో మైలురాయి దాటిన‌ రోహిత్ శ‌ర్మ


Published on: 03 Dec 2025 17:46  IST

బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. స్వ‌దేశీ పిచ్‌ల‌పై అంత‌ర్జాతీయ మ్యాచుల్లో 9 వేల ప‌రుగులు స్కోరు చేసిన బ్యాట‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. ఆ మైలురాయి అందుకున్న నాలుగ‌వ ఇండియ‌న్ బ్యాట‌ర్ అయ్యాడ‌త‌ను. రాయ్‌పూర్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆ మైలురాయి చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 8 బంతుల్లో 14 ర‌న్స్ చేసి రోహిత్ శ‌ర్మ ఔట‌య్యాడు. అయితే అన్ని ఫార్మాట్ల‌లో క‌లిసి స్వ‌దేశీ పిచ్‌పై అంత‌ర్జాతీయ మ్యాచుల్లో 9వేల ర‌న్స్ చేసిన క్రికెట‌ర్ల‌లో రాహుల్ ద్రావిడ్‌ను రోహిత్ శ‌ర్మ దాటేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి