Breaking News

క‌డ్తాల్‌లో ప్ర‌మాదం.మంట‌ల్లో పూర్తిగా ద‌గ్ధ‌మైన కారు


Published on: 03 Dec 2025 17:48  IST

రంగారెడ్డి జిల్లాలోని క‌డ్తాల్ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తున్న కారులో ఇవాళ ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. మ‌క్త‌మాదారం గేటు వ‌ద్ద‌కు రాగానే ఆ ప్ర‌మాదం జ‌రిగింది. స‌డెన్‌గా మంట‌లు వ్యాపించ‌డంతో ఆ కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాలేదు. మంట‌ల్లో కారు పూర్తిగా దగ్ధ‌మైంది. త‌ల‌కొండ‌ప‌ల్లి మండ‌లంలోని వెంటాపూర్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న స‌మ‌యంలో కారు అగ్నిప్ర‌మాదానికి గురైంది.

Follow us on , &

ఇవీ చదవండి