Breaking News

స‌ర్పంచ్ నువ్వా.. నేనా.. ? సై అంటే సై


Published on: 03 Dec 2025 17:59  IST

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య నామినేషన్ వేశాడు. మ‌రోవైపు అత‌ని కొడుకు వెంకటేష్ కూడా అదే స‌ర్పంచ్ స్థానానికి తండ్రికి ప్ర‌త్యర్థిగా నిలబ‌డి ఔరా అనిపిస్తున్నాడు.మిగిలిన అభ్యర్థుల పోటీని అటుంచితే.. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు మాత్రం స‌ర్పంచ్ నువ్వా..నేనా..? సై అంటే సై అన్న‌ట్టుగా బ‌రిలోకి దిగి అంద‌రిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నారు.మ‌రి ఇద్ద‌రు ఎవరు ఓట‌ర్ల మన‌స్సు గెలుచుకుంటారనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి