Breaking News

ఓవర్‌టెక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు..


Published on: 03 Dec 2025 18:09  IST

జార్ఖంఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. హజారీబాగ్‌ జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన కొందరు పశ్చిమ బెంగాల్‌లోని ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో బర్హి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంగ్తాహి వంతెన సమీపంలోకి రాగానే బస్సును ఓవర్‌టెక్‌ చేసేక్రమంలో కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి