Breaking News

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం..


Published on: 03 Dec 2025 18:47  IST

వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో వేల్పుల కమల్ అనే యువకుడు కిరాణా షాప్ నిర్వహిస్తుంటాడు. ఈ నెల రెండవ తేదీ రాత్రి కిరాణా దుకాణంలో సరుకులు కొనేందుకు వెళ్లిన 8 ఏళ్ల బాలికను లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement