Breaking News

నేడే భారత్‌కు పుతిన్‌


Published on: 04 Dec 2025 11:08  IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం.. దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే. షెడ్యూలు ప్రకారం ఆయన గురువారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్‌ డిన్నర్‌కు హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం..హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్‌ నడుమ సమావేశం జరుగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి