Breaking News

ఏపీపీఎస్సీ 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు విడుదల ..


Published on: 04 Dec 2025 12:49  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా 21 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక రాత పరీక్ష(ఓఎంఆర్‌)ల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు 2025 ఏడాదిలో విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌ల పరీక్షల తేదీలను కమిషన్‌ ప్రకటించింది. ఈ పరీక్షలను రెండు విడుతలుగా నిర్వహించనున్నారు. 2026 జనవరి 27 నుంచి 31 వరకు తొలి విడత, ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు రెండో విడత ఈ పరీక్షలు జరగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి