Breaking News

నిరుద్యోగులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త..


Published on: 04 Dec 2025 14:36  IST

తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌ తీపి కబురు చెప్పారు. రాబోయే 30 నెలల్లో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు బుధవారం (డిసెంబర్‌ 4) జరిగిన హుస్నాబాద్‌ సభలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం ఇదే రోజు జరిగిందని గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి