Breaking News

లివిన్ రిలేష‌న్‌పై రాజ‌స్థాన్ హైకోర్టు వ్యాఖ్య‌లు


Published on: 05 Dec 2025 16:26  IST

రాజ‌స్థాన్ హైకోర్టు లివిన్ రిలేష‌న్‌షిప్‌(Live-in Relationship)పై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసింది. యుక్త వ‌య‌సు వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు స‌హ‌జీవ‌నం చేయ‌వ‌చ్చు అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఒక‌వేళ ఆ ఇద్ద‌రికీ పెళ్లి ఈడు రాకున్నా.. లివిన్ రిలేష‌న్‌లో కొన‌సాగ‌వ‌చ్చు అని కోర్టు వెల్ల‌డించింది. పెళ్లి వ‌య‌సు నెపంతో రాజ్యాంగ హ‌క్కుల్ని కొట్టిపారేయ‌లేమ‌ని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ అనూప్ ధండ్ త‌న తీర్పులో ఈ వ్యాఖ్య‌లు చేశారు. యువ జంట‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.

Follow us on , &

ఇవీ చదవండి