Breaking News

బైక్‌పై వెంబడించి..కత్తులుతో అతి కిరాతకంగా..


Published on: 08 Dec 2025 14:46  IST

నగరంలో ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాచకొండ కమిషనరేట్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైంది రియల్టర్ వ్యాపారి వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే వ్యాపారిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు . వెంకట రత్నం బైక్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని మరో బైక్‌పై వెంబడించారు. అదును చూసి అతడిపై కిరాతకంగా దాడి చేశారు నడిరోడ్డుపైనే వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి