Breaking News

అటెన్షన్ ప్లీజ్.! హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్..


Published on: 09 Dec 2025 15:14  IST

గ్లోబల్ సదస్సు సందర్భంగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదుర్చుకోనుండగా, వినోదం నుంచి సాంస్కృతిక రంగం వరకు అనేక కొత్త ప్రాజెక్టులు నగర రూపురేఖలను మార్చేలా సిద్ధమవుతున్నాయి. కొత్వాల్గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు ₹235 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు స్పెయిన్‌ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. సాధారణ ప్రజలకు బీచ్‌లో స్నానం, బోటింగ్ వంటి వినోదాలను ఆస్వాదించే అవకాశముంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి