Breaking News

సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా..


Published on: 12 Dec 2025 14:52  IST

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఆవశ్యకత గురించి సీఎంకు వివరించారు.గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తే రైతులు ఇక్కట్లు తీరి సిరుల పంటలు పండుతాయని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి