Breaking News

ఒకే ఓవర్‌లో 5 వికెట్లతో ప్రపంచ రికార్డు..!


Published on: 23 Dec 2025 18:17  IST

అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఒకే ఓవర్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తిరగరాశాడు గెడె ప్రియందన.బాలి వేదికగా కాంబోడి యాతో జరిగిన మ్యాచ్‌లో 28 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఈ అద్భుత ప్రదర్శన చేశాడు. గతంలో లసిత్ మలింగ, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ వంటి దిగ్గజ బౌలర్లు ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన రికార్డులు ఉన్నాయి. కానీ, పురుషుల లేదా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా ప్రియందన చరిత్ర సృష్టించాడు.

Follow us on , &

ఇవీ చదవండి