Breaking News

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..


Published on: 06 Jan 2026 16:10  IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశం కాబోతోంది. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు ప్రసంగించనున్నారు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Follow us on , &

ఇవీ చదవండి