Breaking News

త్వరలో కేంద్రం కొత్త పథకం..


Published on: 07 Jan 2026 16:29  IST

దేశంలోని పేదలందరికీ కేంద్ర ఆర్ధికశాఖ రూ.46,715 చొప్పున ఇవ్వాలని నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ డబ్బులు మీరు అందుకోవాలంటే లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేయాలని వాట్సప్‌లో ఓ మెస్సేజ్ గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ మెస్సేజ్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) క్లారిటీ ఇచ్చింది. “ఇది పెద్ద స్కామ్. ఆర్ధికశాఖ అలాంటి పథకం ఏమీ ప్రవేశపెట్టలేదు. అంటూ కేంద్రం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి