Breaking News

'సాక్షి' దిన పత్రికపై పరువు నష్టం దావా కేసు..


Published on: 07 Jan 2026 18:22  IST

'సాక్షి' దినపత్రిక మీద ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది.కేసు విచారణ నిమిత్తం నిన్న విశాఖపట్నం వెళ్లిన మంత్రి నారా లోకేష్ ఇవాళ జిల్లా కోర్టుకు హాజరై, సాక్షి తరఫు న్యాయవాదులు నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు సమాధానమిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇది మూడోసారి జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ కావడం విశేషం. 

Follow us on , &

ఇవీ చదవండి