Breaking News

అత్యంత అరుదైన దృశ్యం..


Published on: 08 Jan 2026 14:45  IST

పశ్చిమ బెంగాల్‌లోని కర్సియోంగ్ రేంజ్ డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో అపురూపమైన దృశ్యం వెలుగుచూసింది. అరుదైన నల్ల జింక ఒకటి అటవీ అధికారులకు కనిపించింది. డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బుధవారం డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో ఓ అరుదైన నల్ల జింక ఆయనకు కనిపించింది. వెంటనే ఆయన ఫొటోలు, వీడియోలు తీశారు. నల్ల జింకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి