Breaking News

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం..


Published on: 09 Jan 2026 16:09  IST

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలో 400వ మెట్టు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా నేటి (శుక్రవారం) ఉదయం కొంత సేపు నడక మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపేశారు. ఆపై శ్రీవారి మెట్టు మార్గమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి