Breaking News

దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..


Published on: 09 Jan 2026 16:22  IST

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ విషయంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో రాద్ధాంతం చేయడం కాకుండా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకెళ్లి చర్చించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి సవాల్‌ విసిరారు.గురువారం స్థానిక ద్వారకానగర్‌ టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి