Breaking News

పీఎన్‌బీ లాభం రూ.5,100 కోట్లు


Published on: 20 Jan 2026 12:29  IST

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) డిసెంబరు త్రైమాసికంలో 13ు వృద్ధితో రూ.5,100 కోట్ల లాభం ఆర్జించింది. ఒక త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన అత్యధిక లాభం ఇదే. మొండి బకాయిల తగ్గుదల ఈ వృద్ధికి దోహదపడిందని బ్యాంక్‌ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ ఆర్జించిన లాభం రూ.4,508 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక ఫలితాల స్ఫూర్తితో ఇక ప్రతి త్రైమాసికంలోనూ రూ.5,000 కోట్ల పైబడి లాభం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశోక్‌ చంద్ర చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి