Breaking News

చంద్రబాబు దావోస్‌ మ్యాన్‌


Published on: 20 Jan 2026 13:11  IST

దావోస్‌ మ్యాన్‌ చంద్రబాబు అంటూ ఈరోస్‌ ఇన్నోవేషన్స్‌ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ కిశోర్‌ లుల్లా ప్రశంసలు గుప్పించారు. దావోస్‌ పర్యటనలో భాగంగా సోమవారం నాడు జ్యూరిక్‌లో కిశోర్‌లుల్లాతో సీఎం సమావేశమయ్యారు.రాష్ట్రాన్ని కృత్రిమ మేధో ఆధారిత సృజనాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమం త్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏఐ క్రియేటివ్‌ టెక్‌ హబ్‌ జనరేటివ్‌ ఏఐ డీప్‌ టెక్‌, డిజిటల్‌ కంటెంట్‌ ఎకానమీ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై లుల్లాకు సీఎం వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి